పెరుగుతున్న నొప్పుల సమస్య
ఆధునిక జీవనశైలి కారణం
శ్రీ శ్రేయాస్ ఆస్పత్రి వైద్యుడు సత్యనారాయణ
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): ప్రస్తుత రోజుల్లో ప్రజలకు ఒంటి నొప్పులు పెరుగుతున్నాయని డాక్టర్ పి సత్యనారాయణ (సీనియర్ ఇంటర్వేన్షియనల్ పెయిన్ స్పెషలిస్టు, శ్రీ శ్రేయస్ హాస్పిటల్, కర్మాన్‌ఘాట్, హైదరాబాద్) తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే కనిపించే నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ల నొప్పి లేదా కీళ్ల నొప్పి సమ స్య కనిపించడం సాధారణమైంది.
కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం, మొబైల్ ఫోన్ వినియోగం అధికమవడం, వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, మానసిక ఒత్తిడి, సరైన నిద్రలేమి వంటి కారణాలు దీర్ఘకాలిక నొప్పులకు ప్రధాన కారణా లుగా మారాయి. నొప్పి అనేది శరీరంలోని ఏదైనా భాగంలో గాయం, వాపు, నరాల సమస్య లేదా కండరాల దెబ్బతినడం వల్ల మెదడుకు వెళ్లే ఒక సంకేతం. ఇది మన శరీర రక్షణ వ్యవస్థలో భాగం. అయితే కొన్ని సందర్భాల్లో నొప్పి మూడు నెలలకంటే ఎక్కువ కాలం కొనసాగితే దాన్ని క్రానిక్ పెయిన్ అంటారు.
చాలామంది కొద్దిరోజుల్లో తగ్గిపోతుంది అని భావించి వైద్యులను సంప్రదిం చరు. దీని వల్ల కండరాలు బలహీనపడటం, నరాలపై శాశ్వత ప్రభావం, నడకలో ఇబ్బందులు, శారీరక చురుకుదనం తగ్గిపోవడం, మానసిక ఒత్తిడి పెరగడం, నిద్రలేమి సమస్యలు వంటి సమస్యలు రావచ్చు. పెయిన్ మేనేజ్‌మెంట్ కేవలం నొప్పి మందులు ఇవ్వడం మాత్రమే కాదు. నొప్పి వెనుక ఉన్న అసలు కారణాన్ని గుర్తించి, శస్త్రచికిత్స అవసరం లేకుండా లేదా తక్కువ జోక్యంతో నొప్పిని తగ్గించే ఆధునిక వైద్య విధానం.
ఇందులో పెయిన్ స్పెషలిస్టు వైద్యులు ప్రత్యేక పద్ధతులతో చికిత్స అందిస్తారు. నొప్పి మూ డు వారాలకంటే ఎక్కువగా ఉన్నా, చేతులు లేదా కాళ్లలో మొద్దుబారడం ఉన్నా, నడవడంలో ఇబ్బంది ఉన్నా, మూత్రం లేదా మల నియంత్రణ తగ్గినా, రాత్రిపూట నొప్పి ఎక్కువైనా వెంటనే వైద్యులను సంప్రదించాలి. నొప్పి రాకుండా ఉండటానికి ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవాలి. వ్యాయా మం చేయాలి. బరువును నియంత్రణలో ఉంచాలి. సరైన భంగిమలో కూర్చోవాలి. ఎక్కువసేపు మొబైల్ ఉపయోగించకూడదు. కాల్షియం, విటమిన్ డి సరిపడా తీసుకోవాలి, సరైన నిద్ర తీసుకోవాలి’ అని తెలిపారు.






