17 May, 2026 | 10:49 PM

చారిత్రాత్మక వార్షిక స్కాలర్‌షిప్ ప్రకటించిన యూడబ్ల్యూఏ ఇండియా

17-05-2026 09:39 PM

ముంబై, మే 2026: యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా (యూడబ్ల్యూఏ), ఒక చారిత్రాత్మక స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని యుడబ్ల్యుఏ ఇండియా ద్వారా ప్రకటించింది. ఇది భారతీయ మార్కెట్‌లోని అత్యంత ముఖ్యమైన స్వతంత్ర హామీలలో ఒకటి. విభిన్న విద్యా, సామాజిక-ఆర్థిక , ప్రాంతీయ నేపథ్యాలకు చెందిన, అధిక సామర్థ్యం గల విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో యూడబ్ల్యూఏ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పునరుద్ఘాటిస్తుంది.

యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ అమిత్ చక్మా మాట్లాడుతూ ఈ చారిత్రాత్మక స్కాలర్‌షిప్ నిబద్దత, భారతదేశం పట్ల యూడబ్ల్యూఏకు వున్న ప్రగాఢమైన, శాశ్వతమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. తాము ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యుడబ్ల్యుఏ విద్యను పొందే అవకాశాలను మరింతగా  విస్తరిస్తున్నట్టు తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులు తమ  పూర్తి సామర్థ్యాన్ని గ్రహించి, ప్రపంచ స్థాయి కెరీర్‌లకు సిద్ధమయ్యేలా తోడ్పాటునందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

యుడబ్ల్యుఏ ఇండియా కోసం దరఖాస్తులు ఇప్పుడు స్వీకరిస్తున్నారు. ముంబై మరియు చెన్నైలలో క్యాంపస్‌లతో యూడబ్ల్యూఏ ఇండియా ప్రపంచ పారిశ్రామిక డిమాండ్స్ , భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా, స్టెమ్, బిజినెస్, టెక్నాలజీ రంగాలలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల పోర్ట్‌ఫోలియోను అందిస్తుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్: https://www.uwa.edu.au/india ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రధానంగా ట్యూషన్ ఫీజు తగ్గింపుల ద్వారా అందించబడే ఈ బహుళ విధాన స్కాలర్‌షిప్ కార్యాచరణ, భారతీయ నియంత్రణ అవసరాలు, యూడబ్ల్యూఏ యొక్క ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటూనే, విద్యా ప్రతిభ, ఆర్థిక అవసరం, నాయకత్వ సామర్థ్యం, ప్రాంతీయ సమ్మిళితత్వాన్ని గుర్తిస్తుంది.

ఈ ప్రోగ్రామ్‌లో మెరిట్ స్కాలర్‌షిప్‌లు, గ్లోబల్ ఎక్సలెన్స్ స్కాలర్‌షిప్‌లు, ఈక్విటీ మరియు సీఎస్ఆర్-మద్దతు గల నిధులు, రాష్ట్ర ప్రభుత్వ సహ-నిధుల అవకాశాలు (ప్రారంభంలో మహారాష్ట్ర మరియు తమిళనాడులో), మరియు పూర్వ విద్యార్థుల మద్దతు గల స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. విద్యాపరమైన కఠినత్వంతో పాటు విద్యార్థుల సంఖ్యను కూడా సమతుల్యం చేసేలా రూపొందించబడిన ఈ కార్యక్రమం, అర్హులైన విద్యార్థులకు పలు రకాల మద్దతును మిళితం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. యుడబ్ల్యుఏ ఇండియా అడ్మిషన్లతో పాటుగా ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమం కూడా ప్రారంభించబడుతుంది.