20 May, 2026 | 4:52 AM

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

20-05-2026 12:00 AM

ములకలపల్లి,మే 19(విజయక్రాంతి):  పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ములకలపల్లి మండలంలోని చలమన్ననగర్ గ్రామంలో మంగళవారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్,డీజిల్ ధరలు గత వారం రోజుల నుండి సామాన్యుడు ఉదయం నిద్రలేచే సరికి భారీగా పెట్రోల్,డీజిల్ పై 3,4 రూపాయలు పెంచుతూ అమల్లోకి తెచ్చి వాహనదారులకు భారీ షాక్ ఇచ్చి,ఆయిల్ కంపెనీలు పశ్చిమాసియా యుద్ధం సంక్షోభం నేపథ్యం, హార్మోజ్ జల సంధి మూసివేత కారణాలు చెబుతున్నప్పటికీ 2014 లో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో కి వచ్చేనాటికి లీటరు పెట్రోలు 70  రూపాయలు ఉండగా2026 నాటికి 114 రూపాయలకు,డీజిల్ 60 రూపాయలు ఉండగా 98 రూపాయలకు పెంచి ఈ 12 సంవత్సరాల కాలంలో రూ 25.30 కోట్ల  భారత దేశ ప్రజలపై భారం వేసిందని ఆరోపించారు. నరేంద్ర మోడీ వేసిన పన్ను ల భారాన్ని రద్దు చేయాలని ,ప్రజలంతా  వ్యతిరేకించాలన్నారు.

లేనిపక్షంలో ఉద్యమా లను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అమర్లపూడి రాము, నూపా భాస్కర్, కల్లన్న,కల్లూరి కిషోర్, తోడెం దుర్గా,పోతుగంటి లక్ష్మణ్, సంయుక్త మండల కార్యదర్శి కోర్సా రామకృష్ణ, అశ్వారావుపేట మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు, దమ్మపేట మండల కార్యదర్శి కురసం ముత్యాలరావు, డివిజన్ నాయకులు కల్లూరి పద్మ, గోనెల రమేష్, కొప్పుల మోహనరావు, బండారు రామారావు,పి వై ఎల్ నాయకులు సవల్ల శివ,నరేందర్,గడ్డం వెంకటేష్  పాల్గొన్నారు.