ప్రజాస్వామ్య పద్ధతిలో హిల్ట్ పాలసీ
- నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడమే ప్రభుత్వ లక్ష్యం
- మే మొదటి వారం నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువ అమలులోకి
- క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంతోపాటు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రభుత్వం హిల్ట్ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫ ర్మేషన్) తీసుకొ చ్చిందని, ఈ పాలసీని ప్రజాస్వామ్య పద్ధతిలో అమలు చేయడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
శుక్రవారం సచివాలయంలో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కమిటీచైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు కమిటీ సభ్యులు, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ప్రతినిధులు సైతం వారి అభిప్రాయాలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. యూడీఎల్(అన్ డెవలప్డ్ ల్యాండ్) పాలసీ కింద భూములను అభివృద్ధి చేసే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇండస్ట్రియల్ పార్కుల ప్రతినిధులు కలిసి అభివృద్ధి చేసుకునే ఆలోచన చేయాలన్నారు.
ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్డ్ మధ్య ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తే మంచిదని, చైనాతరహాలో పారిశ్రామికపా ర్కులు ఏర్పాటుచేయాలని ప్రతినిధులు సూ చించారు. స్వాగతిస్తున్నామని, పరిశీలిస్తా మని భట్టి స్పష్టంచేశారు. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న అన్ని ఇండస్ట్రియల్ అసోసియేషన్‌లతో చర్చించి హిల్ట్‌పాలసీ అమలును వేగ వంతం చేసుకుందామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు బాగానడవాలి, కాలుష్యం ఉండకూ డదు హిల్ట్ పాలసీలో ప్రభుత్వం చాలా ఓపెన్‌గా ఉందని కమిటీసభ్యుడు, మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో కార్మికుల కోసం డార్మెటరీలు తప్పని సరి చేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖల పరిధిలోని భూముల వివరాలు సేకరించాలని, వాటిలో ఖాళీగా ఉన్నవి, ఆక్రమణకు గురైనవి, శాఖల అందుబాటులో ఉన్న వాటి వివరాలు సేకరించాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు.
మే మొదటి వారం నుంచి సవరించిన భూముల మార్కె ట్ విలువలను అమలు చేయాలని రిజిస్ట్రేషన్‌అధికారులను సబ్ కమిటీ ఆదేశించింది. ఈ నిర్ణయాలను అధికారులు స్పష్టంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు శశాంక, కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.






