9 June, 2026 | 1:24 AM

అక్రమంగా నిర్మిస్తున్న సెల్‌టవర్ తక్షణమే తొలగించాలి

09-06-2026 12:00 AM
  1. భాస్కరరావు గార్డెన్, ఎల్‌ఐసీ కాలనీ వాసుల డిమాండ్
  2. కంటోన్మెంట్ బోర్డ్ కార్యాలయం ఎదుట స్థానికుల ధర్నా

సికింద్రాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): సెల్ టవర్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కాంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ముందు బైఠాయించి, ప్లే కార్డులను పట్టుకొని టవర్స్ ఏర్పాటను వ్యతిరేకిస్తూ సోమవారం స్థానిక కాలనీ ప్రజలు ధర్నా చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంటోన్మెంట్ బోర్డు పరిధిలోని భూసరెడ్డి గూడ, భాస్కర రావు గార్డెన్, లో నిర్మిస్తున్న ఈ ఆక్రమ సెల్ టవర్ నిర్మాణాన్ని తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని, ఆ ప్రాంత పర్యావరణాన్ని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు .

ఈ సెల్ టవర్ ఏర్పాటు వలన భూసరెడ్డి గూడ,ఎల్ ఐ సీ కాలనీ, భాస్కర్ రావు గార్డెన్ తదితర ప్రాంతాల ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందన్నారు. ఆక్రమంగా నిర్మిస్తున్న సెల్ టవర్ తక్షణమే నిలిపివేయించాలని కోరుతూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్, మారేడుపల్లి తహసిల్దార్, కంటోన్మెంట్ బోర్డ్ సీఈవో, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, కు  ఫిర్యాదు చేసినప్పటికీ సదరు వ్యక్తి సెల్ టవర్   ఏర్పాటు చేయడం అనుమానాలు కలిగిస్తున్నాయని స్థానిక భాస్కరరావు గార్డెన్ బూస రెడ్డి గూడా ఎల్‌ఐసి కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆక్రమంగా నిర్మిస్తున్న ప్రాంతం గతం నుండి వివాద పద స్థలముగా ఉందని ఆరోపించారు .

అటువంటి స్థలంలో సెల్ టవర్ ఏర్పాటుకు అనుమతు లు ఏ విధంగా ఇచ్చారని కంటోన్మెంట్ బోర్డ్ అధికారులను స్థానికులు ప్రశ్నించారు. ఇప్పయికైనా సెల్ టవర్ ఏర్పాటును విరమింప చేయాలని సీఈఓ కు విజ్ఞప్తి చేసారు. అంతకుముందు ధర్నా అనంతరం బోర్డు ఇంజనీరింగ్ విభాగం టౌన్ ప్లానర్ ఫణి కుమార్ ను కలిసి జననివాసాల మధ్య సెల్ టవర్ నిర్మించడాన్ని తాము పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నామని ,వెంటనే పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీనికి ఆ అధికారి సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని సిఈఓ దృష్టికి తీసుకువెళ్లి ప్రజల డిమాండ్ అనుగుణముగా  చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసి కాలనీ ప్రెసిడెంట్ దుబ్బాక కిషన్ రావు, స్థానిక నాయకులు రామచందర్, తిరుపతి, స్థానిక మహిళా గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.