29 April, 2026 | 2:13 AM

కుంభకోణాల ది ఇండియా స్టోరీ

29-04-2026 12:21 AM

కాజల్ అగర్వాల్, శ్రేయ స్ తల్పడే నటించిన సోషియో-నేషనల్ డ్రామా ‘ది ఇం డియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’. చేతన్ డీకే దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాగర్ బీ షిండే రచించి, నిర్మించారు. దేశవ్యాప్తంగా ప్రభావం చూపే సమకాలీన అంశాలతో రూపొందించిన ఈ చిత్రం జూలై 24న విడుదల కానుంది. జీ స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల చేస్తోంది.

ప్రధానంగా రసాయనాల దుర్వినియోగం, పురుగుమందుల సాగు, సంబంధిత కుంభకోణాల నేపథ్యంలో సాగే కథ ఇది. ఒక కుటుంబం ఎదుర్కొనే కష్టాలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పెద్ద సంక్షోభాన్ని ఇందులో చూపించనున్నారు. వ్యవస్థలోని లోపాలు, కఠినమైన నియంత్రణల అవసరం వంటి ఈ చిత్రంలోని అంశాలు కూడా ప్రభావవంతంగా ఉంటాయని టీమ్ పేర్కొంది. ఈ చిత్రానికి డీవోపీ: నిశాంత్ భగవత్; సంగీతం: మంగేశ్ ధక్డే; గీత సాహిత్యం: షకీల్ అజామీ; ఎడిటర్: ఆశిష్ మహాత్రే.