29 April, 2026 | 2:13 AM

కింగ్100 సెట్స్‌లోకి టబు ఎంట్రీ!

29-04-2026 12:22 AM

టాలీవుడ్ సీనియర్ స్టార్ నాగార్జున అక్కినేని ప్రస్తు తం తన 100వ మైలురాయి చిత్రం కోసం పనిచేస్తున్నారు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతోంది. దర్శకుడు రా. కార్తిక్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. నాగార్జున సినీ ప్రయాణానికి పర్‌ఫెక్ట్ సెలబ్రేషన్‌గా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పనులు ఇప్పటికే వేగంగా కొనసాగుతున్నాయి.

తాజాగా ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ తీసుకొస్తూ.. నటి టబు ‘కింగ్ 100’ సెట్స్‌లో అడుగుపెట్టారు. ఈ చిత్రం లో కీలక పాత్రలో కనిపించనున్న టబు ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటున్నా రు. నాగార్జున, టబులది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించనుండటం సినిమా పై ఆసక్తిని మరింత పెంచుతోంది.

ఈ కాంబోలో ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి విజయవంతమైన చిత్రాలు ప్రేక్షకులను అలరిం చాయి. ‘సిసింద్రీ’లో కూడా టబు ప్రత్యేకంగా కనిపించారు. తాజా సినిమాలోనూ వీరి రీయూనియన్ మ రోసారి ఆ మ్యాజిక్‌ను రిపీ ట్ చేయబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటు లు, సాంకేతిక బృందం వివరాలు మేకర్స్ త్వరలో వెల్ల డించనున్నారు.