29 April, 2026 | 2:16 AM

బొగ్గు గనుల సిండికేట్ల కథతో..

29-04-2026 12:19 AM

సంయుక్త మీనన్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన హై-వోల్టేజ్ ప్రాజెక్ట్, హీరోయిన్ -సెంట్రిక్ పాన్- ఇండి యన్ యాక్షన్ డ్రామా ‘ది బ్లాక్ గోల్డ్’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యోగేశ్ ఖవీ దర్శకత్వంలో మాగంటి పిక్చర్స్ సహకారంతో హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేశ్ దండా నిర్మిస్తున్న చిత్రమిది.

తెలంగాణ సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ కథ.. చేతిలో గన్ ఉన్నప్పటికీ చట్టాన్ని ముఖ్యంగా భావించే ఒక పోలీస్ ఆఫీసర్ చు ట్టూ తిరుగుతుంది. ఈ చిత్రాన్ని మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఆదిలాబాద్ ప్రాంతాలతోపాటు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లలో చిత్రీకరించారు. షూటింగ్ విశేషాలను తెలియజేస్తూ టీమ్ పంచుకున్న ఓ మేకింగ్ వీడియో ఆకట్టుకుంది. 

మురళీశర్మ, రావు రమేశ్, నాసర్, మనీష్ వాధ్వా, రాంకి, రవీంద్ర విజయ్, అడుకలం నరేన్, దీూ రవి, కృష్ణ చైతన్య, చంద్రిక రవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం సమకూర్చగా, ఏ వసంత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్-ఇండియన్ రిలీజ్‌కు రానుందీ సినిమా.