పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు
కామారెడ్డి, మే 8 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం కామారెడ్డిలో జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కేక్ కట్ చేసి మంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవితాంతం బాగుండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, సబ్బని కృష్ణా హరి, క్రీడా అధ్యక్షులు లక్ష్మీ నరస గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్, మాజీ కౌన్సిలర్ లు జమీల్, చింతల రవీందర్ గౌడ్, గౌరీ నవీన్, చేవెళ్ల రాజు, బల్ల శ్రీను, సునీల్ గౌడ్, బండారి శ్రీకాంత్, శశి, నిరంజన్, రాహుల్, మెహర్ బాబా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.






