గోదావరి నుంచి ఇసుక అక్రమ తరలింపు ట్రాక్టర్ సీజ్, కేసు నమోదు
17-03-2026 12:14 AM
అశ్వాపురం, మార్చి 16 (విజయక్రాంతి): చింతిర్యాల వద్ద గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం గోదావరి నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తీసుకు వస్తున్న డ్రైవర్ లంకా సాయిరాం చింతిర్యాలగూడెం గ్రామం కు చెందిన ట్రాక్టర్ను పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై డ్రైవర్ లంకా సాయిరాం పై అలాగే ట్రాక్టర్ యజమాని వెన్న అశోక్ పై PౄPP యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలించినట్లయితే వారి ట్రాక్టర్లను సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.




