12 April, 2026 | 10:35 AM

డైనోసార్లను తుడిచిపెట్టిన జుపిటర్ ఉల్క

17-08-2024 03:28 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 16: భూమిపై 6.6 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన భారీ డైనోసార్లను ఒక్కదెబ్బతో పూర్తిగా తుడిచిపెట్టేసిన ఉల్క గురించి తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు కొత్త విషయాలు కనుగొన్నారు. ఆ రాకాసి ఉల్క ఎక్కడినుంచి వచ్చిందనే విషయాన్ని తేల్చారు. బృహస్పతి గ్రహం సమీపంలోని ఉల్కల వలయం నుంచి వచ్చిన ఆ ఉల్క భూమిని ఢీకొట్టి జీవజాలాన్ని అంతం చేసిందని జర్నల్ సైన్స్ అనే పత్రికలో ప్రచురితమైన పరిశోధన వ్యాసంలో వెల్లడించారు. మెక్సికో సమీపంలో ఇది భూమిని తాకిందని తెలిపారు. గతంలో తోకచుక్క భూమిని ఢీకొట్టడం వల్ల భూమిపై డైనోసార్లు అంతరించాయని అందూ భావించారు. కానీ, తాజాగా గ్రహశకలం ఢీకొట్టడంవల్ల ఆ ఉత్పాతం జరిగిందని తెలిపారు.