మీ సీఎం అభ్యర్థి ఎవరు?
17-08-2024 03:29 AM
షిండే సర్కార్‌కు ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్న
మహారాష్ట్ర, ఆగస్టు 16: ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార, విపక్ష కూటముల మధ్య మాటల యుద్ధం అప్పుడే మొదలైపోయింది. శుక్రవారం నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో.. శరద్ పవార్ (ఎన్సీపీ), కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలతో కలిసి శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే ముందు షిండే సర్కార్ తమ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాలని.. ఆ తర్వాతే ఎన్నికల్లో పోటీకి వెళ్లాలని ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, శరద్ పవార్(ఎన్సీపీ) ప్రకటించే సీఎం అభ్యర్థికి తమ పార్టీ బేషరుతుగా మద్దతు ప్రకటిస్తుందని ఉద్ధవ్ స్పష్టం చేశారు.




