calender_icon.png 10 September, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది బీఆర్‌ఎస్.. కుంగింది వారి హయంలోనే

08-09-2025 12:18:46 AM

  1. కొందరు కాళేశ్వరం లేకుంటే నీళ్లు లేవని ఫ్లెక్సీలు కడుతున్నారు
  2. కుంగిన మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ ఫోటోలు ఫ్లెక్సీలో కట్టాలి
  3. మేడిగడ్డ పనిచేయకపోయినా అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయి
  4. ఆ ప్రాజెక్టు వద్ద నీళ్లు నిలిపితే ఎన్నో గ్రామాలు ముంపునకు గురవుతాయి
  5. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 07 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది బీఆర్‌ఎస్. కుంగింది వారి హయాంలోనేనని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. వేములవాడ అర్బ న్ మండలం ఈ నేపథ్యంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.గత ప్రభుత్వం ఐదు లక్షలు. ఇ స్తానని మోసం చేసిందని విమర్శించారు. దాని పై కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు.

అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీదర్ బాబు,పొన్నం ప్రభాకర్, వంటి అనేక మందితో కలసి నిరసనలు చేశామని. పేర్కొన్నారు.వెనుకబడిన వేములవాడ ను అభివృద్ధి చేయాలని అనేక ధర్నాలు చేశామని తెలిపారు. నేడు ప్రజా ప్రభుత్వం లో వెనుకబడిన వేములవాడ ను ముందు కు తీసుకెళ్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీదర్ బాబు, పొ న్నం ప్రభాకర్ ఇతర మంత్రులు ఈ ప్రాంత అభివృద్ధికి మద్దతుగా నిలుస్తున్నారని వివరించారు.

రూ.240 కోట్లతో ముంపు గ్రా మాల ప్రజలకు 4696 ఇల్లు మంజూరు చే శామని వెల్లడించారు. ప్రత్యేక ప్యాకెజి కింద ముంపు గ్రామాల నిర్వాసితులకు. అందరికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముం దుకు వెళ్తుందని స్పష్టం చేశారు.18 సంవత్సరాల వయసు దాటిన వారి సమస్యలు త్వర లో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కరించేందుకు అధికార యంత్రాం గం సిద్ధంగా ఉందని తెలిపారు.

కొందరు కాళేశ్వరం లేకుంటే నీళ్లు లేవని ఫ్లెక్సీలుకడుతున్నారని, వాళ్ళను ఏమనలో అర్ధం కావ డం లేదని పేర్కొన్నారు. ఈ సంవత్సరం కా లేశ్వరం లోని మేడిగడ్డ వద్ద అసలు నీరే ఆపలేదని, అన్నారం సుందిళ్ల వద్ద బొంగలు ప డి చుక్క నీరు నిలవలేదని తెలిపారు. నేషన ల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు సమగ్ర విచారణ జరిపి నీరు నిలిస్తే ప్రమాదమని రిపోర్ట్ ఇచ్చారని,నీళ్లు ఆపడం వల్ల కింద గల 40 గ్రామాలతో పాటు భద్రాచలానికి ఇబ్బంది.

తలెత్తుతుందని అధికారులు తెలిపారని. స్ప ష్టం చేశారు.బీఆర్‌ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టు. వారి హయాంలోనే కృంగిపోయిం ది దేశ చరిత్రలోనే ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదని గుర్తు చేశారు.ప్రాజెక్టులో చుక్క నీరు ఆపకున్న కొందరు రాజకీయ పబ్బం పబ్బం గడుపుకునేదుకు, రైతులను తప్పుదోవ పట్టించడానికి కొందరు ఫ్లెక్సీలు అక్క డక్కడ ఫ్లెక్సీలు కడుతున్నారని విమర్శించా రు.

వాటిని చూసిన ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారని వివరించారు. ఆనాడు వైస్ రాజశేఖర్ రెడ్డి కట్టిన ఎల్లంపల్లి,కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరాం సాగర్ ప్రోజెక్ట ద్వారా నీళ్లు వస్తున్నాయని తెలిపారు.రంగురంగుల బ్రో చర్లు తయారుచేయడంలో.మిడ్ మానేరు, ఎ ల్‌ఎండికి, ఎల్లంపల్లి నుండి వరద కాలువకు ఎస్సారెస్పీ నుండి నీళ్లు వస్తున్నాయని స్ప ష్టం చేశారు. రంగురంగుల బ్రోచర్లు తయా రు చేయడంలో ఫ్లెక్సీలు కట్టడంలో ఆ పార్టీ వారు ఆరితేరారని, రైతులారా ప్రజలారా బి ఆర్‌ఎస్ వారు అల్లే కట్టు కథలను నమ్మవద్దని. సూచించారు.

గతంలో వేములవాడ దేవస్థానం అభివృద్ధి చేయకుండా బ్రిడ్జి ని ర్మాణం చేయకుండా చేసినట్లుగా రంగురంగుల బ్రోచర్లతో ప్రజలను మభ్య పెట్టారని గుర్తు చేశారు. నేడు ప్రజా ప్రభుత్వం లో వే ములవాడ పట్టణం దేవస్థానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని తెలిపారు. ప్రజలను తరలించి కుంగిన ప్రాజెక్ట్ లు చూ పెట్టాలి.గతంలో ప్రజలను బస్సుల్లో తరలించి కాలేశ్వరం ప్రాజెక్టు చూపించినట్టు గా,నేడు కూడా బస్సుల్లో ప్రజలను తరలించి కుంగిన మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలను చూపెట్టాలనీ పేర్కొన్నారు

అప్పుడు వా స్తవాలు ప్రజలకు తెలుస్తాయని స్పష్టం చేశా రు. కుంగిపోయిన మేడిగడ్డ, ఇసుక దిబ్బలో కింది నుండి వెళ్తున్న అన్నారం సుందిళ్ల ఫోటోలను గ్రామాల్లో కట్టండి అని సూచించారు. పి సి గోస్ కమిషన్ విచారణ చేపట్టి కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పారని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కాలేశ్వరం ప్రాజెక్టుపై చర్చించి సిబిఐ ఎంక్వైరీ వేస్తామని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

కాలేశ్వరం నీరు చుక్క వాడకుండానే ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత సంవత్సరం రెండు లక్షల పై చిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించామని వెల్లడించారు.ప్రాజెక్టులోకి వస్తున్న ప్రతి చుక్క నీరు యధావిధిగా సముద్రంలోకి వెళ్తుందని విప్ వివరించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదికను కూడా బీఆర్‌ఎస్ వారు తప్పుపడుతున్నారని చెప్పారు.వారు మద్దతిస్తేనే వారి హయాంలో లోక్ సభలో నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ సంస్థ ఏర్పడిందని గుర్తు చేశారు.