08-09-2025 12:18:20 AM
మండల అధ్యక్షుడు గుగ్గిళ్ల సురేష్, ప్రధానకార్యదర్శి జానపట్ల జయరాజు
మంగపేట, సెప్టెంబరు 7 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం 49వ ఆవిర్భవ దినోత్సవాన్ని సెప్టెంబర్ 21ఘనంగా నిర్వహించుటకు అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు డా,జె బి రాజు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అవిలయ్య ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి మంగపేట మండల అంబేద్కర్ యువజన సంఘం నాయకులు హాజరయ్యారు.
యువజన సంఘం వ్యవస్థాపకులు డా,జె బి రాజు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలసాధన కోసం అహర్నిశలు కష్టపడుతూ విజయం సాధించాలన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సెప్టెంబర్ 21న జరగబోవు 49వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కర్రీ శ్యామ్ బాబు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి దిగొండ కాంతారావు, మండల అధ్యక్షులు గుగ్గిళ్ల సురేష్, ప్రధానకార్యదర్శి జానపట్ల జయరాజు, ఉపాధ్యక్షులు గాదె శ్రీనివాస చారి, కర్రీ శ్రీను, కోశాధికారి యాసం హరీష్, నిమ్మగడ్డ ప్రవీణ్ పాల్గొన్నారు.