calender_icon.png 10 September, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంగర గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షురాలి నియామకం

08-09-2025 12:19:36 AM

భీమదేవరపల్లి , సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) ః హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామ మహిళా కాంగ్రెస్ శాఖ అధ్యక్షురాలిగా సంధ్యను ఆదివారం నియమించారు. జిల్లా ఇన్చార్జ్ శైలజ, జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, మండల అధ్యక్షురాలు చిదురాల సరూప సంధ్య కు నియామకపు పత్రం అందజేశారు. తన నియామకానికి సహకరించిన శైలజ ,స్వరూప, సరళ సంధ్య కృతజ్ఞతలు తెలియపరిచారు.

మహిళా కాంగ్రెస్ లో మహిళలను పెద్ద ఎత్తున చేర్పించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా సంధ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొక్కల స్రవంతి, గాదపాక శారద , సుహాసిని, అన్నపూర్ణ , మంజుల, కళావతి, స్నేహలత పాల్గొన్నారు.