కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నిరంతరం కొనసాగించాలి...
భారత రాష్ట్ర సమితి పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
కోరుట్ల, ఆగస్టు 17 (విజయక్రాంతి): బీడీ కార్మికులకు వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాలని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నిరంతరం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల పట్టణ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్ర సమితి పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతు బీడీ కార్మిక మహిళలను వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు అలాగే పేద మధ్యతరగతి కుటుంబాల అండగా నిలిచే కల్యాణ లక్ష్మి శాది ముబారక్ పథకాలను నిరంతరం కొనసాగించాలని కోరారు.
గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు చీటి స్వరూప వెంకట్రావు, నత్తి రాజ్ కుమార్ కౌన్సిలర్లు జాల వినోద్ మాధవి, టేకుల నరేష్ శిరీష భారత రాష్ట్ర సమితి పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.






