కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకాలను పునర్దరించాలి
సుజాతనగర్, ఆగస్టు 17 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సుజాతనగర్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం భారీ రాస్తారోకో నిర్వహించారు. పార్టీ శ్రేణులు నల్లజెండాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ సుజాతనగర్ మండల అధ్యక్షుడు లావుడియా సత్యనారాయణ నాయక్, నాయకులు చింతలపూడి జగన్, పెద్దమల్ల నరేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రూ.1,00,116 ఆర్థిక సహాయం అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు






