calender_icon.png 9 January, 2026 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన పరిశోధనలకు కామారెడ్డి సైన్స్‌ఫెయిర్ వేదిక కావాలి

08-01-2026 01:17:11 AM

కలెక్టర్ ఆశిష్ సంగు వాన్

కామారెడ్డి, జనవరి 7 (విజయక్రాంతి): కామారెడ్డిలోని అబ్దుల్ కలాం ప్రాంగణం విద్యానికేతన్ హై స్కూల్ లో నిర్వహిస్తున్నటువంటి ఇన్స్పైర్ మనక్ అవారడ్స్,  53వ రాజ్యస్తరీయ బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శిని ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ సందర్శించి సమీక్షించారు.  అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలను సలహాలను ఇచ్చారు. రాష్ట్రస్థాయి సైన్స్ పేరుకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి 887 ప్రదర్శనలు సైన్స్ ఫెయిర్ కు 1786 మంది విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్క విభాగానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ మొత్తం 27 విభాగాలలో కమిటీలను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు విజ్ఞాన శాస్త్ర అభిమానులకు భావితరాల సైంటిస్టులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  విద్యార్థులకు ముఖ్యంగా మంచినీటి వసతిని, భోజన వసతిని సౌకర్యవంతంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు.

భావిశాస్త్రవేత్తలకు అనుగుల మైనటువంటి వాతావరణాన్ని కల్పించడం ద్వారా వారిలో కొత్త ఆలోచనలను రేకే తెచ్చి రాబోవు తరాలకు సౌకర్యమంతమైనటువంటి పరిశోధనలు చేసే దిశగా వారి ఆలోచన దృక్పథాన్ని పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమమే అయినప్పటికీ ప్రస్తుతం ఆధునికత రాకెట్ వేగంతో దూసుకుపోతున్న తరుణంలో నూతన ఆవిష్కరణల ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఆ దిశగా కామారెడ్డి సైన్స్ ఫెయిర్ కేంద్ర బిందువు కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.