4 May, 2026 | 7:50 AM

నాణ్యమైన వైద్యానికి తూట్లు

21-08-2025 12:00 AM

వైద్యో నారాయణో హరి అన్నారు మన పెద్దలు! వైద్యున్ని దేవునితో సమానంగా ఆదరించాలని భావించారు. కానీ నేటి వైద్య విధానం సమాజ దోపిడీకి పాల్పడుతుంది. రోగం ఏదైనా వైద్యం ఒకటే అన్నట్లు.. చిన్నపాటి గాయానికి కూ డా పెద్ద తరహా పరీక్షలు నిర్వహించడం పరిపాటిగా మారిపోయింది. దీనివల్ల సా మాన్య జనం ఆస్పత్రికి వెళ్లాలంటే జం కుతున్నారు. కాలుకు ముల్లు గుచ్చుకుంటే నిలువెత్తు స్కానింగ్ చేయడం మనం గమనిస్తున్నాం.

దేశంలో ప్రజలు విద్యా, వైద్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని, అ త్యంత నాణ్యమైన స్థాయిలో సమగ్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ వై ద్యం చేయాల్సిన డాక్టర్లే అవినీతి, మోసా లు, దోపిడీలకు పాల్పడుతూ నాణ్యమైన వైద్యానికి తూట్లు పొడుస్తున్నారు.

రాజ్యాం గ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ‘విద్య, వైద్యాన్ని పాలకులు  ఉచితంగా నాణ్యమై న స్థాయిలో అందించడానికి ప్రయ త్నం చేయరు. కారణం ఏంటంటే.. విజ్ఞానంతో చైతన్యవంతులైన ప్రజలు పాలకుల దుర్మార్గాలను ఎత్తిచూపి ప్రతిఘటిస్తారు’. అదే రాజ్యాంగంలో విద్యా, వైద్యాన్ని ప్రజలకు నాణ్యమైన స్థాయిలో ఉచితంగా అందించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ అంటీ ముట్టినట్లు వ్యవహరిస్తుడటం బహుశా అందుకేనేమో! 

అందినకాడికి దోపిడీ..

ప్రధానంగా వైద్యారోగ్యం వ్యవస్థలో అత్యంత కీలక అంశం. భారతదేశంలో పేదరికం, నిరుద్యోగం, ఉపాధి లేమి వంటి కా రణాల వల్ల సరైన పోషకాహారం అందకపోవడం, చికిత్స చేయించుకోవడానికి తగి న డబ్బు లేకపోవడం వల్ల అనారోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు. దీంతో ఇంటి పెద్దను కోల్పోతున్న సదరు కుటుంబాలు మరింత పేదరికంలోకి జారుకోవడం లాం టి అంశాలను గమనిస్తూనే ఉన్నాం. 

ప్రభుత్వ రంగంతో పాటు పూర్తిగా ప్రైవేటుపరమైన వైద్యం ప్రజల పాలిట దోపిడీగా మారిపోయిందని ప్రజలు వాపోతున్నారు. నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని గొ ప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు సరైన సౌకర్యాలున్న ఆసుపత్రులను నిర్మించడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతు న్నాయి.

వైద్యాన్ని ప్రైవేటు పరం చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. సంప న్న వర్గాలకు మాత్రమే ప్రైవేటు ఆసుపత్రులు అందుబాటులో ఉంటున్నాయి. మరి పేద, మధ్యతరగతి వర్గాల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. అరకొర బడ్జెట్ నిధుల కారణంగా  దేశవ్యాప్తంగా వైద్యాన్ని ప్రైవేటు రంగానికి కట్టబెట్టి ప్రభుత్వం చోద్యం చూస్తుంది.

మానవతా ధోరణి అవసరం..

ప్రభుత్వమా? ప్రైవేటా? సంబంధం లేకుండా  వివిధ రాష్ట్రాలలో వైద్యారోగ్య సౌకర్యాలు కొనసాగుతున్న తీరును పరిశీలించినప్పుడు  కొన్నిచోట్ల వైద్యులు రోగు ల పట్ల దురుసుగా ప్రవర్తించడం, చెప్పిన విషయాలు పూర్తిగా వినకపోవడం, సందేహాలు తీ ర్చకపోవడం, కసురుకోవడం వంటి లక్షణాల కారణంగా  తాము సరైన స్థాయిలో చికిత్స పొందలేకపోతున్నారు.  రోగులకు చికిత్స కంటే  వైద్యుని  తీపి వచనాలు ముఖ్యమని  నమ్మే వాళ్ళు కూడా లేకపోలేదు.

వైద్యులు సహా కిందిస్థాయి సిబ్బంది, రోగులకు తృప్తికరమైన సమాధానాలతో పాటు వారి సందేహాలను తీర్చ డానికి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ వైద్యశాలల్లో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాల రూపంలో ఇస్తున్న డబ్బంతా ప్ర జల చెమటతో కూడుకున్నదే. కొన్ని చోట్ల పని చేసినటువంటి వైద్యులు ప్రభుత్వ ప్రై వేటు ఏదైనా కూడా  ఆ ప్రాంతాలలో  ఒక ఆదర్శ వ్యక్తిగా గుర్తించబడిన సందర్భాలు కూడా అనేకం.

ఎందుకంటే  ప్రజలతో మమేకమై, అదే ప్రాంతంలో నివాసాన్ని ఏ ర్పాటు చేసుకొని, కష్ట సుఖాలలో ఎప్పు డూ ప్రజలకు అందుబాటులో ఉండే వి ధంగా ఆలోచించేవాళ్లు, ఉచితంగా అవకాశం ఉన్న మేరకు చికిత్సను అందించడా నికి ముందుకొచ్చే వాళ్ళు కూడా అనేక ఉన్నారు. ఆ రకంగా ప్రతి వైద్యుడు యాం త్రిక ఆలోచనను వదిలి, స్వార్థపూరిత లక్షణాలను విడిచిపెట్టి, ప్రజా ప్రయోజనాన్ని సామాజిక చింతన అలవరుచుకోవాల్సిన అవసరముంది.

చేస్తున్న వైద్య వృత్తికి మానవత కోణాన్ని జతచేసి తోటి మనిషిని సాటి మనిషిగా చూడాలి. మనిషిని మనిషిగా ప్రేమించడంతో పాటు వైద్య సేవలందించడం నా బాధ్యత అని గుర్తించిన నాడు ఇలాంటి విమర్శలు రాకుండా ఉండే అవకాశం ఉంది. విమర్శలతో ప్రజలకు దూరమవుదామా? ప్రజలతో గుర్తిం చబడి వైద్యానికి చేరువవుదామా?  అనేది వైద్య సిబ్బంది ఆలోచించుకోవాల్సింది ఉంటుంది.

  అరకొర బడ్జెట్‌లతోనే సరి..

వైద్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని ప్రజలు ఎందుకు డిమాండ్ చేస్తు న్నారనేది ఒకసారి ఆలోచించాలి. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఈ హక్కును పొందడానికి ప్రజలు మౌలికంగా ఆలోచిస్తున్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా నాణ్యమైన వైద్యం ప్రజలకు అందని ద్రాక్షగా మిగిలిపోతుంది. ప్రభుత్వం నాణ్యమైన వైద్యం అందించాలని ప్రజలు కోరు తున్నారు.

కేంద్రంతో సహా అన్ని రాష్ట్రాలకు కూడా సుమారుగా 1-2 శాతం మాత్ర మే వైద్య రంగానికి బడ్జెట్లో నిధులను కేటాయిస్తున్నారు. ప్రభుత్వ వైద్యరంగం బలో పేతం కాకపోగా అరకొర సౌకర్యాల కారణంగా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. మరో వైపు ప్రైవేటు ఆసుపత్రులు తమ జేబులకు చిళ్లు పెడుతున్నా ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం లేక వారి వద్దకే వెళ్తూ తమ ఆదాయంలో 60 నుంచి 70 శాతాన్ని కోల్పోతున్నారు. అదే ప్రభుత్వాసుప్రతి వైద్యులయ్యుంటే వారిని ప్రశ్నించడానికి అన్ని హక్కులు ఉంటాయి. కానీ ప్రైవేట్‌లో ఆ అవకాశం లేదు. 

వైద్యవృత్తినే అమ్మకానికి..

ఇటీవలే కాలంలో ప్రభుత్వ వైద్యశాల ల్లో పనిచేస్తున్న డాక్టర్లు కొంతమంది ప్రైవే టు పెట్టుబడిదారుల వలలో చిక్కిన సందర్భాలు కోకొల్లలు. కిడ్నీ రాకెట్ ముఠాలతో చేతులు కలిపి వైద్యవృత్తికి కళంకం తెస్తున్న వైద్యులు ఎందరో ఉన్నారు. పేదవాళ్లను ఆసరాగా చేసుకొని వారికి మాయమాటలు చెప్పి వైద్యం పేరుతో నగరాలకు తీసుకువచ్చి కిడ్నీ సహా ఇతర శరీర భాగాలను అమ్ముకుంటూ పవిత్రమైన వైద్య వృత్తిని అమ్మకానికి పెడుతున్నారు.

ఈ అంశాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరింల్సిన అవసరముంది. వైద్యులను నమ్మి ఆసుపత్రులకు వచ్చే పేద వర్గాలకు చికిత్స పేరుతో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. ఆపరేషన్ పేరుతో ఐసీయూకు తీసుకెళ్లి కనీసం మనకు చూసే భాగ్యం కూడా లేకుండా శరీర భాగాల అమ్మకాల పేరుతో లక్షల కోట్ల రూపాయలను దండుకోవడం చూస్తే వైద్య వృత్తి ఎంత నీచ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

కాబట్టి వైద్యం ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగినట్లయితే అధికారుల నిరంతరం పర్యవేక్షణతో పాటు ప్రభుత్వాలు కూడా బాధ్యతగా ఉంటాయి. కాస్త నిబద్ధతతో పనిచేసే అవకాశముంటుంది. అందుకు వైద్యశాలల్లో పని చేసే సిబ్బందికి పూర్తిస్థాయి వేతనాలతో పాటు రాత్రిపూట పనిచేసే వారికి అలవెన్స్‌ల పేరుతో ఎక్కువ వేతనాలను ఇవ్వడం అవసరం. ప్రజలను దృష్టిలో ఉంచుకొని వేతన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరముంది.

కానీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి నామమాత్ర వేతనాలు ఇచ్చి  నాణ్యత లేని వైద్యులను ఉపయోగించుకుంటూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ప్రతిఏటా ప్రకటించే బడ్జెట్‌లో వైద్య రంగానికి హెచ్చు నిధులు కేటాయించాల్సిన అవసరముంది. ఎంతటి చికిత్స అయినా దానికి సంబంధించిన ఖర్చులను ప్రభుత్వమే భరించేలా డిమాండ్ చేసే అవకాశాన్ని కల్పించాలి. ప్రజాస్వామిక వాదులు తమ వాదనలను బలంగా వినిపించాల్సిందే. ప్రభుత్వ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉంది.