4 May, 2026 | 9:11 AM

వృద్ధులకు అండగా నిలుద్దాం

21-08-2025 12:00 AM

వృద్ధుల జనాభాలో భారతదేశం  గణనీయమైన పెరుగుదలను చూస్తోంది. ప్రస్తుతం 153 మిలియన్లు (60 అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు) ఉన్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 347 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. భారతదేశంలో పెరుగుతున్న వృద్ధుల జనాభా సవాళ్లను పెంచుతుంది. ఎందుకంటే ఈ జనాభా సమూహం తరచుగా ఆరోగ్యం, ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటుంది. 

ఒకప్పుడు కుటుంబ వ్యవస్థలో పెద్దల మాట కీలకం. వారికి సేవలు చేయడాన్ని గౌరవంగా భావించేవారు. కుటుంబ పెద్ద తీసుకునే నిర్ణయా నికి కట్టుబడేవారు. కాలానుగుణంగా క్రమంగా ఈ సంస్కృతిలో మార్పులు వచ్చాయి. సమాజంలో ప్రస్తుతం వయోవృద్ధుల్లో చాలా మంది నిరాదరణకు గురవుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరముంది. బతుకునిచ్చి, బతుకుదెరువు చూపిన మార్గదర్శకులకు అండగా నిలిచి వారిని కంటికి రెప్పలా కాపాడుకుందాం. నేడు ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. 

భారత్‌లో పెరుగుతున్న వృద్ధులు

వృద్ధుల జనాభాలో భారతదేశం  గణనీయమైన పెరుగుదలను చూస్తోంది. ప్ర స్తుతం 153 మిలియన్లు (60 అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు) ఉన్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 347 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. భారత దేశంలో పెరుగుతున్న వృద్ధుల జనాభా సవాళ్లను పెంచుతుంది.

ఎందుకంటే ఈ జనాభా సమూహం తరచుగా ఆరోగ్యం, ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటుంది. భారతదేశంలోని చాలా మంది వృద్ధ పౌరులు ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్థిరత్వం, సామాజిక భద్రత లేకుండానే జీవిస్తున్నారు. ఫలితంగా, వారి చివరి మజిలీలో అండగా నిలబడాల్సిన అవసరం  ఏర్పడింది. మన దేశంలో వయో వృద్ధుల కోసం కొన్ని ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ మరిన్ని పథకాల అవసరం మాత్రం ఉంది.

ఇప్పటివరకు భారత్‌లో వృద్ధుల కోసం ప్రధాన మంత్రి వయో వందన యోజన, వరిష్ఠ పెన్షన్ బీమా యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ చట్టం 2007, అన్నపూర్ణ పథకం, వృద్ధుల ఆరోగ్య సంరక్షణ లాంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ పథకాలన్నీ వృద్ధులకు అందుతున్నాయా లేదా అని విశ్లేషించుకోవాలి.

సంరక్షించే చట్టాలు.. 

ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవాన్ని ఆంగ్లంలో ‘సీనియర్ సిటిజెన్ డే’ గా పిలుస్తారు. ఈరోజున వృద్ధుల సమస్యలు, వా రి సంక్షేమం గురించి అవగాహన కల్పించడంతో పాటు సమాజానికి వారు చేసిన సేవలను, గౌరవాలను వివరిస్తారు. ప్రపం చ వయో వృద్ధుల దినోత్సవం భారతదేశంలో ఘనంగా నిర్వహించడం ఆనవా యితీగా వస్తుంది.

ఈ సందర్బంగా పెద్దలకు గౌరవం, వారిని కాపాడుకోవడం, వారి అవసరాలను తీర్చే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. భార తదేశంలో వృద్ధులను సంరక్షించడానికి.. చట్టం, రాజ్యాంగ హామీలు, పెన్షన్లు, రకరకాల ఆరోగ్య స్కీం లు ఉన్నాయి. పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం.. పిల్లలు వృద్ధులను పోషించడం బాధ్యత అన్న సంగతి గుర్తు ఎరగాలి. వృద్దులు దీని పొందడం లో విఫలమైతే ఫిర్యాదు చేసి సత్వర న్యాయం పొందవచ్చు.

అవసరమైతే వృద్ధులకు నెల వారి పోషణ కింద జీతభత్యాలు పొందేలా చట్టా లు వీలు కల్పించాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 ప్రకారం వృద్ధులకు సామాజిక భద్రత ఆరోగ్యం కల్పించవలసిన చర్యలను ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరముంది. ఇక 1999 వృద్ధుల జాతీయ పరిరక్షణ చట్టం కింద వృద్దులకు ఆరోగ్యం, ఆహారం, వసతి సామాజిక భద్ర త కల్పించే మార్గదర్శకాలు జారీ చేసింది.

2011లో దీనిని సవరిస్తూ సీనియర్ సిటిజన్ల జాతీయ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం వయో వృద్ధులకు ఆదాయ ఉత్పత్తికి అవకాశాలను అందించడంతో పాటు, కుటుంబ సంరక్షణ, సమాజ ప్రమేయం ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది. దీనితో కేంద్ర రాష్ర్ట  ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు రూపొం దించి అమలు  చేస్తున్నాయి. ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీం ద్వారా 60 ఏళ్ళు పై బడిన వృద్ధులకు నెలవారీ పెన్షన్, అదే విధంగా రాష్ర్ట ప్రభు త్వాలు తమ విధానాల ప్రకారం పెన్షన్ అందిస్తున్నాయి.

నిరాదరణే ఎక్కువగా..

1988 లో అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ వయోవృద్ధుల దినోత్సవం తొలుత ప్రారంభించారు. వారు కుటుంబానికి సమాజానికి, ఇచ్చిన సేవలను గుర్తిం చి, గౌరవించి సన్మానించ డం,వారి ద్వారా సంస్కృతి, ఆచారాలు కొత్త తరం నేర్చు కోవడం కోసం వారధి గా పని చేస్తాయి. కానీ మారుతున్న కాలం లో విద్యావంతు లు సైతం వృద్ధుల ను దూరంగా పెట్టి నిరాదరణకు గురి చేస్తున్నారు. ఆస్తులకు మాత్రమే వారసత్వంగా పొందేందుకు పోటీ పడుతున్నారు.

పెన్షన్ పైసల కోసం, ఆస్తి కోసం వృద్ధులను చంపేస్తున్నారు. చాలా మంది అనాధాశ్రమంలో చేరుస్తున్నారు. సమాజంలో రోజురోజుకు నశిస్తు న్న నైతిక విలువలు ఈ పరిణామాలకు అవకాశం కల్పిస్తున్నాయి. మన ఎదుగుదలకు కారణం అయిన వారిని ఎదిగిన తర్వాత విస్మరించడం ఏ మతం కూడా ఒప్పుకోదు. ప్రాచీన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం అని చెప్పుకునే మన దేశంలో నిరాదరణకు గురవుతున్న వృద్ధు ల సంఖ్య లక్షల్లో ఉంది. 

మనిషి రూ పంలో ఆలోచించి వృద్ధులను భారంగా భావిస్తున్నారు. శ్రావణ కుమారుడు వృ ద్ధులైన తల్లిదండ్రులను పల్లకిలో మోసి తీర్థయాత్రలు తిప్పాడు. శివాజీ తన తల్లి నుంచే ధైర్య స్ఫూర్తిని పొందాడు. వృద్దులే సంస్కృతి, చారిత్రక వారసులు.. వారిని భారంగా కాకుండా బాధ్యతతో కాపాడు దాం.

యద్భావం తద్భావ తే.. నీవు వృ ద్దుల పట్ల అనుసరించినదే నీకు జరుగుతుంది. వృద్ధులు కూడా కాలమాన పరిస్థితుల ప్రకారం పిల్లలపై పూర్తిగా నమ్మకుండా వృద్ధాప్యంలో తమకు తా ము ఆస్తులు కానీ, నెలసరి ఆదాయం పొందే విధంగా జాగ్రత్తగా ఉండటం అవసరం. వృద్ధాశ్రమాలు పెరుగుట గొప్పత నం కాదు క్షీణిస్తున్న నైతిక విలువలకు ప్రమాణం. అయినా ఈ యవ్వన జీవితం తర్వాతి కాలంలో వయో దశకు మారాల్సిందే అన్నది జగమెరిగిన సత్యం.

వ్యాసకర్త సెల్:  9440408080