4 May, 2026 | 6:41 AM

ఐడీబీఐని అమ్మకానికి పెట్టొద్దు

22-08-2025 12:00 AM

కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)ను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నది. అక్టోబర్ మధ్య ఆర్థిక బిడ్లను పిలవాలని యోచిస్తోంది. లైఫ్ ఇ న్సూరెన్స్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో అమ్మకంలో కంపెనీలోని 60.72% వాటాను విక్రయించడం జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 50 వేల కోట్ల రూపాయలు వస్తాయని భా విస్తున్నారు. 2003లో అప్పటి ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ పార్లమెంటు ఉభయ సభల్లో.. ప్రభుత్వం ఐడీబీఐలో తన వాటాను ఎప్పుడూ 51 శాతం కంటే తక్కువకు తగ్గించదని హామీ ఇచ్చారు.

2018లో ప్రభుత్వం తన వాటాను 30 శాతానికి తగ్గించింది. ఐడీబీఐలో ఎక్కువ వాటాలను ఎల్‌ఐసి కొనుగోలు చేసినప్పటికీ ఐడీబీఐ ప్రభుత్వ రంగ బ్యాంకుగానే ఉంటుందని కేంద్రం ప్రకటించింది. 2021 నుంచి ప్రభుత్వం ఐడీబీఐలో ఎక్కువ వాటాను ప్రైవేట్ కంపెనీకి, విదేశీ, భారతీయ సంస్థకు అమ్మడానికి అడుగులు వేసింది. సంస్థ, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఐడీబీఐని ప్రభుత్వ రంగ బ్యాంకుగా పరిగణించేలా చూడాలని ప్రజలు ఐడీబీఐ  ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

 వేణు మాధవ్, హైదరాబాద్