23 July, 2026 | 1:51 AM

భూ సర్వే గడువులోగా పూర్తి చేయాలి

23-07-2026 12:00 AM

కలెక్టర్ అంకిత్ 

భద్రాద్రి కొత్తగూడెం/జూలూరుపాడు, జులై 22 (విజయక్రాంతి): భూ సర్వే కు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించే నిర్ణయత గొడవ పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. బుధవారం జూలూరుపాడు మండలంలో సీతారామ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూ సర్వే పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, మెరుగైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సర్వే పురోగతిపై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, సర్వేలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్తూరులో కొనసాగుతున్న భూ సర్వే పనులను పరిశీలించి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

జూలూరుపాడు మండలం పడమటి నరసాపురంలోని గిరిజన బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వంటశాల, విద్యార్థుల వసతి గదులు, పారిశుధ్య నిర్వహణను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై సమగ్రంగా ఆరా తీశారు.