31 May, 2026 | 2:05 AM

చట్టసవరణ చేసి టెట్ నుంచి మినహాయింపునివ్వాలి

31-05-2026 01:34 AM

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): టెట్ రివ్యూ పిటిషన్లపై ఇటీవల వెలువడిన సుప్రీంకోర్టు తీర్పు కారణంగా లక్షలాది మంది ఉపాధ్యాయులు ప్రభావితమవుతున్న నేపథ్యంలో తక్షణమే శాసనపరమైన ఉపశమనం కల్పించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం -అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వొద్నా ల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

ఉపాధ్యాయులకు మినహాయింపు కల్పించేందుకు రాబో యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆర్డినెన్స్ లేదా చట్ట సవరణ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు కోరారు. ఈ తీర్పు కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా అంకితభావంతో, నిజాయితీతో సేవలం దిస్తున్న లక్షలాది మంది ఉపాధ్యాయుల్లో అసంతృప్తి, ఆందోళన, తీవ్రమైన మానసిక ఒత్తిడి ఏర్పడిందని వారు పేర్కొన్నారు.