త్వరలో ఉచిత బస్సు ప్రయాణానికి ఇంటిగ్రేటెడ్ కార్డులు
- అప్పటి వరకు యాథావిధిగానే మహిళలకు సేవలు
- ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న ‘ఇంటిగ్రేటెడ్ కార్డ్స్’ లోనే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరచనుంది. ఈ కార్డ్ ద్వారానే ప్రభుత్వం అందించే వివిధ రకాల సంక్షేమ పథకాలు, సేవలలతోపాటు భవిష్యత్తులో మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదు పాయాన్ని కల్పించనున్నారు
అయితే ఈ కొత్త కార్డుల జారీ ప్రక్రియ, విధివిధానాలు పూర్తి అయ్యేంత వరకు మహిళలకు ప్రస్తుతం కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. మహిళా ప్రయాణికులు తమ ఆధా ర్ కార్డ్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఆర్టీసీ సిబ్బందికి చూపించి ఎప్పటిలాగే ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని ఆయన కోరారు.






