1 August, 2026 | 6:56 PM

Breaking News

కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ   •   ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ పోస్టర్ ఆవిష్కరణ   •   ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ   •   చిట్టాపూర్‌లో మహిళా గ్రామసభ   •   నిజాయతీ చాటుకున్న వ్యాపారికి సామాజిక కార్యకర్త ఘన సన్మానం   •   పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొట్ట మొదటి టీకా   •   గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం   •   ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య   •   వికలాంగులకు అన్నదానం చేసిన తాటిపల్లి భూపతి   •  

డీఈఈ సెట్ ఫలితాలు విడుదల

31-05-2026 01:32 AM

7918 మంది ఉత్తీర్ణత

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): డీఈఈసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. తెలుగు మీడియం కోర్సుకు 12,373 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 9612 మంది పరీక్షకు హాజరుకాగా, 7918 (82.37 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ కోర్సులో తొలి ర్యాంకును బి. ఆనందు సాధించారు. ఇంగ్లీష్ మీడియానికి 18,985 మంది దరఖాస్తు చేసుకోగా, అందు లో 14,414 మంది పరీక్షకు హాజరుకాగా, వీరిలో 12,784 (88.69 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.

ఈ కోర్సులో ఫస్ట్ ర్యాంకు ను జవ్వాజి శివ నాగేశ్వర్ సాధించారు. ఉర్దూమీడియానికి 1234 మంది దరఖాస్తు చేసుకో గా, 1028 మంది పరీక్ష రాస్తే 435 (42.31 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో దానిష్ అహ్మద్ తొలి ర్యాంకును సాధించారు. జూన్ 2 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని డీఈఈ సెట్ కన్వీనర్ జి.రమేష్ తెలిపారు. వెబ్‌ఆప్షన్ల్ల నమోదు జూ న్ 6 నుంచి 8 వరకు అవకాశం కల్పించారు.