calender_icon.png 18 September, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడీ ప్రభుత్వ సారధ్యమే దేశానికి శ్రీరామరక్ష

18-09-2025 08:55:16 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): భారతదేశానికి మోడీ ప్రభుత్వ సారాధ్యమే శ్రీరామ రక్ష లాంటిదని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర, బిజెపి తిమ్మాపూర్ మండలసేవ పక్వాడ అభియాన్ తిమ్మాపూర్ మండల కన్వీనర్, కో కన్వీనర్ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, ఎర్రోజు లక్ష్మణ్ అన్నారు. సేవా పక్వాడ ప్రోగ్రాంలో భాగంగా గురువారం రోజున అలుగునూరు పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ పంచముఖ, శ్రీ రామ సాయి దేవాలయంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ మండల బిజెపి నేతలు దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచారు.

ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడి దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడం జరిగిందని, మోడీ ప్రభుత్వం 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చిందన్నారు. ఇట్టి స్వచ్ఛభారత్ ముఖ్య ఉద్దేశం మన చుట్టూ ఉన్న పరిసరాలు చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా  కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్ ,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బోనాల మోహన్ ,కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి వేల్పుల రవీందర్ యాదవ్, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.