18-09-2025 08:58:54 PM
కోదాడ: కోదాడ పట్టణంలోని కె ఆర్ ఆర్ ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాల(KRR Government Autonomous Degree College)కు చెందిన ఏడుగురు విద్యార్థులు మహాత్మా గాంధీ యూనివర్సిటీ కబడ్డీ జట్టుకు ఎంపికయ్యారు. ఈనెల 17 న మంగళవారం యూనివర్సిటీ కబడ్డీ జట్టు ఎంపిక యూనివర్సిటీలో నిర్వహించారు. అందులో భాగంగా కళాశాలకు చెందిన .కే. అజిత్. నవీన్ డి. అనిల్ ఎం గురుమూర్తి ఎం మహేష్ బాబు ఎం నాగరాజుతో పాటు యూనివర్సిటీ మహిళా కబడ్డీ జట్టుకు జి. శ్రీజాలు ఎంపికయ్యారు.
ఎంపికైన విద్యార్థులు అక్టోబర్ 4 నుండి కర్ణాటక రాష్ట్రంలోని బెహల్గాంలో గల రాణి చందమ్మ యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ జట్టు తరఫున కబడ్డీ టీంలో పాల్గొంటారు. గురువారం కళాశాలలో యూ నివర్సిటీ జట్టుకు ఎంపికైన విద్యార్థులను కే ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హదస రాణి మేడం అభినందించి మెడల్స్ తో సత్కరించి సౌత్ జోన్ పోటీలో మంచి ప్రతిభ ప్రదర్శించి బహుమతులతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పిడి పి ఫ్రాన్సిస్, వైస్ ప్రిన్సిపాల్ చందా అప్పారావు, కబడ్డీ కోచ్ నామా నరసింహారావు, అధ్యాపకులు డాక్టర్ సైదిరెడ్డి, ఎస్. ఎమ్. రఫీ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.