calender_icon.png 13 July, 2025 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవృత్తి సవాళ్లతో కూడుకున్నది

13-07-2025 12:25:33 AM

- ఈ వృత్తిలో ప్రవేశించేవారి సంఖ్య పెరగడం సంతోషం

- విదేశీ డిగ్రీల కోసం కుటుంబాలు అప్పులపాలు కావొద్దు

- న్యాయవ్యవస్థలో ఏఐని వినియోగించుకోవాల్సిన సమయం ఆసన్నం

- నల్సార్ వర్సిటీ 22వ స్నాతకోత్సవంలో సీజేఐ గవాయ్

- కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మేడ్చల్, జూలై 12 (విజయ క్రాంతి): న్యాయవాద వృత్తిలో అనేక సవాళ్లతో కూ డుకున్నదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేర్కొన్నారు. న్యాయవాదులు నిరంతరం తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుందన్నా రు. ప్రస్తుతం న్యాయవ్యవస్థలో ఎన్నో సవా ళ్లు ఉన్నాయని, కొన్ని కేసుల విచారణ దశాబ్దాల పాటు సాగడం ఆందోళన కలిగిస్తుం దన్నారు. కోర్టు తీర్పుల పట్ల అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.

ప్రస్తుతం న్యా యవాద వృత్తిలో ప్రవేశించే వారి సంఖ్య పెరగడం సంతోషకరమని చెప్పారు. శనివా రం మేడ్చల్ జిల్లా షామీర్‌పేట్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పీఎస్ నరసింహ ముఖ్య అతిథులుగా హాజరుకాగా, హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్ పాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీజేఐ బీఆర్ గవా య్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో కృత్రి మ మేధస్సు (ఏఐ)ని వినియోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే తీర్పులను వేగంగా అందించడంలో సహాయపడుతుందని సీజే ఐ అభిప్రాయపడ్డారు.

ఇందులోనూ సానుకూల, ప్రతికూల ఫలితాలు ఉంటాయని చె ప్పారు. సరైన మార్గదర్శకత్వంతోనే.. నైపు ణ్యం సాధించగలమని తెలిపారు. మెంటార్‌షిప్ ను ఒక బాధ్యతగా భావించాలని, చేసే పనిని ప్రేమిస్తే సత్ఫలితాలు ఫలితాలు వస్తాయన్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్నత నైపుణ్యాలు మాత్రమే కాకుండా, సృజనాత్మకత, నిర్మాణాత్మకతలతోనే విజయాలు సా ధ్యమవుతాయని పేర్కొన్నారు. యువ న్యాయవాదులకు, విద్యార్థులకు సీజేఐ కీలక సూచనలు చేశారు. విదేశీ డిగ్రీల కోసం కు టుంబాలు అప్పులపాలు కావొద్దని పేర్కొన్నారు.

ఇతరులను చూసి విదేశీ విద్య వైపు వెళ్లొద్దని, విదేశీ విద్యపై ఆసక్తి చూపడం భారత న్యాయవ్యవస్థ పై విశ్వాసం లేకపోవడాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఇక్కడి జాతీ య న్యాయ విశ్వవిద్యాలయాలు ఇతర సం స్థల కంటే మెరుగ్గా ఉన్నాయని, వాటి నుంచి మంచి ప్రయోజనాన్ని ఆశించొచ్చని పేర్కొన్నారు. విదేశీ డిగ్రీలు ప్రతిభను పెంచు తాయనేది అపోహేనని, ఒకరి ప్రతిభ వారి పని ద్వారా మాత్రమే నిరూపించుకోవాలని సూచించారు. స్నేహితులు, కుటుంబం, పుస్తకాలు, అభిరుచులు, ఆరోగ్యం, ఊహ అనే ముఖ్య విషయాలను అన్నివేళలా చెక్కుచెదరకుండా ఉంచుకోవాలని  ఈ విషయాన్ని ఓ ముఖ్య అతిథిగా కాకుండా సంరక్షుడిగా చెబుతున్నానన్నారు. ఈ సందర్భంగా సీజేఐ విద్యార్థులకు 58 బంగారు పతకాలు ప్రదా నం చేశారు.

పుస్తకాల విడుదల 

పిల్లల హక్కులు, తులనాత్మక క్రిమినల్ చట్టాలు కాంట్రాక్టులపై చిత్రపరమైన హ్యాం డ్‌బుక్, నల్సార్ లా సమీక్ష జనరల్ పుస్తకాలను ఈ సందర్భంగా అతిథులు విడుదల చేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ శ్రీకృష్ణదేవరావు, రిజిస్ట్రార్ ఎస్ వాసంతి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, పదవీ విరమణ చేసిన న్యాయ మూ ర్తులు, న్యాయ ప్రముఖులు పాల్గొన్నారు.