13-07-2025 12:22:51 AM
- మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నం
-బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా. కే లక్ష్మణ్
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు, సీఎం రేవంత్‌రెడ్డి బీసీల జీవితాలతో చెలగాటమా డుతున్నారని, బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా. కే లక్ష్మణ్ ఆరోపించారు. ఓ వైపు రాష్ర్టపతి వద్ద బీసీ బిల్లు పెం డింగులో ఉండగా మరోవైపు ప్రభుత్వం తె చ్చే ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదించే అవకా శం ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లా డారు.. బూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయకుండా సర్కారు ఎందుకు భయపడుతోందని నిలదీశారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రభుత్వం బీసీలను రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుని లబ్ధిపొందే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆర్డినెన్స్ ను ఎమ్మెల్సీ కవిత స్వాగతిస్తుంటే.. మిగతా బీఆర్‌ఎస్ నేతలు సాధ్యం కాదంటూ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు కాకముందే కాంగ్రెస్ సంబు రాలు చేస్తున్నదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు కాబట్టి ఈ అంశంలో పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు.
ఇదెక్కడి రోల్ మోడల్..
బీసీ రిజర్వేషన్లకు తెలంగాణ రోల్ మోడల్ అంటున్న కాంగ్రెస్ సర్కారు..చేసిన సర్వే అంతా తప్పుల తడకగా ఉందని లక్ష్మణ్ అభివర్ణించారు. దేశమంతటా ఇదే రకమైన మోసం చేస్తారా అని ప్రశ్నించారు. బీసీలలో ముస్లింలను చేరుస్తూ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు కేటాయించి బీసీల హక్కులను కాలరాసేందుకు కుట్ర చేశారని విమర్శించారు. ముస్లింలకు బీసీల కోటాలో రిజర్వేషన్లు ఇస్తే అసలు బీసీల పరిస్థితి ఏంటని నిలదీశారు. న్యాయపరమైన గణాంకాలు బహిర్గతం చేయకుండా ముందుకు వెళ్లడం సరికాదన్నారు. పార్టీ సామాజిక సమీకరణాల్లో భాగంగానే రామచందర్‌రావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిం చినట్లు తెలిపారు. బండారు దత్తాత్రేయ, బండి సంజయ్, తాను బీసీలమేననని..తామంతా పార్టీ రాష్ర్ట అధ్యక్షులుగా పనిచేయలేదా అని ప్రశ్నించారు.