13-07-2025 12:29:57 AM
- డైరెక్టర్ కొండా శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహణ
ఖమ్మం, జూలై 12 (విజయక్రాంతి): ఆషా ఢ మాసం సందర్భంగా ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని రెసోనెన్స్ పాఠశాలలో విద్యార్థులకు శనివారం మెహందీ వేడుకలు నిర్వ హించారు. సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా మెహందీ వేడుకలు నిర్వహిస్తున్నట్టు రెసోనెన్స్ పాఠశాల డైరెక్టర్ కొండా శ్రీధర్ తెలిపారు. ఆషాఢ మాసంలో తెలుగు వారందరూ గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.
పిల్లలు ఈ సందర్భంగా రంగురంగులో బట్టలు వేసుకొ ని వివిధ ఆకృతులలో గోరింటాకు పెట్టుకొ ని సందడి చేశారు. పిల్లలకు విద్యతో పాటు అన్ని విషయాల్లో ముందుండేలా తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రెజినెన్స్ శ్రీనగర్ కాలనీ సంస్కృతి సంప్రదాయాలకు వారధిగా ఉంటుందని తెలిపారు. డైరెక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ.. సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహి స్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పివిఆర్ మురళీమోహన్, సిబ్బం ది పాల్గొన్నారు.