13-07-2025 11:30:06 AM
మేడిపల్లి,(విజయక్రాంతి): కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్, అశోక్ నగర్ కు చెందిన నాగవల్లి రాo చందర్ (55), తండ్రి సోమయ్య,కు భార్య (నాగవల్లి శ్రీవాణి (54), ముగ్గురు ఆడపిల్లలు, ఒక సంవత్సరం నుండి భార్య, పిల్లలతో దూరంగా ఉండటంతో, మద్యానికి బానిసై ఒంటరిగా ఉన్నానని తీవ్ర మనస్థాపానికి గురై శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది .కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి సిఐ తెలిపారు.