13-07-2025 12:37:12 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతారి స్వామి జన్మదిన వేడులను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి ఆయన నివాసానికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యoతో సంపన్నమైన జీవితం గడపాలని ఎమ్మెల్యే వినోద్ ఆయనను దీవించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మల్లయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ కారుకూరి రామచందర్ బంధుమిత్రులు సైతo నాతరి స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.