calender_icon.png 13 November, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొదమసింహం కొంగొత్తగా!

13-11-2025 12:46:40 AM

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో సక్సెస్, జానర్ పరంగా చూస్తే ఒక ప్రత్యేకమైందిగా చెప్పుకోదగ్గ చిత్రం ‘కొదమసింహం’. చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబాయ్ సినిమా కూడా ఇదే. కే మురళీమోహనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధ, సోనం, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో రాజ్ కోటి సంగీతం, మోహన్‌బాబు కామెడీ ప్రత్యేక ఆకర్షణగా నిలువడమే కాకుండా అప్పట్లో ప్రేక్షకులను అలరించాయి.

1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కించుకున్న ఈ సినిమా మళ్లీ ఇప్పుడు సరికొత్తగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 21న 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వరరావు రీరిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయకుడు చిరంజీవి బుధవారం సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ రీ రిలీజ్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. వింటేజ్ మెగాస్టార్ స్టుల్, స్వాగ్, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్.. ఈ ట్రైలర్‌లో మెస్మరేజ్ చేస్తున్నాయి. 4కే కన్వర్షన్ క్వాలిటీ, 5.1 డిజిటల్ సౌండింగ్.. ఈ ట్రైలర్‌ను మళ్లీమళ్లీ చూసేలా చేస్తున్నాయి.