calender_icon.png 13 November, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హలో.. మందాకినీ!

13-11-2025 12:47:53 AM

మహేశ్‌బాబు కాంబోలో ఓ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ‘గ్లోబల్ ట్రాటర్’ (వర్కింగ్ టైటిల్)గా ప్రచారంలో ఉంది. నవంబర్ 15న హైదరాబాద్‌లో ఓ భారీ ఈవెంట్ నిర్వహిస్తున్న విషయాన్ని ఇటీవల వెల్లడించారు. అంతకన్నా పృథ్వీరాజ్ సుకు మారన్‌ను ప్రతినాయకుడు ‘కుంభ’గా పరిచయం చేస్తూ అధికారింగా ప్రకటించిన టీమ్.. ‘సంచారీ..’ గీతాన్ని విడుదల చేసి ఆశ్చర్యపరిచారు. శ్రుతిహాసన్ ఆలపించిన ఈ పాట ఇప్పటికే సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఇదిలావుండగా, బుధవారం టీమ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంక చోప్రా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ప్రియాంక ఇందులో మందాకిని పాత్రలో కనిపించనుంది. ఫస్ట్‌లుక్‌లో ప్రియాంక చీరకట్టులో గన్ పేలుస్తూ యాక్షన్ మోడ్‌లో దర్శనమిచ్చింది. అందం, ఫైర్ కలగలిసిన ఈ స్టిల్ మెస్మరైజ్ చేస్తోంది. దర్శకుడు రాజమౌళి ఎక్స్ వేదికగా ఈ పోస్టర్‌ను పంచుకుంటూ “ప్రపంచ వేదికపై ఇండియన్ సినిమాను పునర్నిర్వచించిన మహిళ. దేశీ గర్ల్ మళ్లీ వచ్చేసింది. ‘మందాకిని’ భిన్న పార్శాలను చూడటానికి ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది” అని పోస్ట్ పెట్టారు. ‘ఆమె పైకి కనిపించే దాని కన్నా ఇంకా ఎక్కువ.. మందాకినికి హలో చెప్పండి’ అని ప్రియాంక పేర్కొనగా, ‘ఆమె వచ్చేస్తోంది.. ఇదిగో మందాకిని’ అంటూ మహేశ్ పోస్ట్ పెట్టారు.