13-11-2025 12:45:28 AM
రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. సందీప్‌రాజ్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి మడోల్కర్ కథానాయిక కాగా, బండి సరోజ్‌కుమార్, హర్ష చెముడు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అడవి నేపథ్యంలో యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా టీజర్‌ను స్టార్ హీరో ఎన్టీఆర్ బుధవారం ఆవిష్కరించారు. రామ హీరోహీరోయిన్లను, రావణుడిలా విలన్‌ను చూపుతూ ఆధునిక రామాయణంలా ఈ కథను తెరపై ఆవిష్కరించనున్నట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది.
రోషన్ కనకాల కొత్త లుక్‌తో కనిపించడం.. ఉత్తరాంధ్ర యాసలో డైలాగులు చెప్పడం ఆకట్టుకుంది. అతనికి జోడీగా సాక్షి మదోల్కర్ సహజంగా నటించింది. ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకర్షిఆంచేలా ఉంది. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ; డీవోపీ: రామ మారుతి ఎం; యాక్షన్: నటరాజ్ మాడిగొండ; ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్; ఆర్ట్: కిరణ్ మామిడి.