24 March, 2026 | 5:51 PM

లుక్ మారింది..

19-11-2024 01:43 AM

సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో సినిమా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా కోసం మహేశ్ తన లుక్‌ను పూర్తిగా మార్చేశారంటూ నిన్న మొన్నటి వరకూ టాక్ నడిచింది. వాస్తవానికి మహేశ్ కూడా గడ్డం, లాంగ్ హెయిర్ స్టుల్‌తో దర్శన మిచ్చారు.

అమెజాన్ అడవులు, మహేశ్ వివిధ ప్రదేశాలు తిరుగుతుంటారు.. హాలీ వుడ్ తరహా మూవీ అంటూ ప్రచారం జరగ డంతో ఆ లుక్ రాజమౌళి సినిమా కోసమేనని అంతా భావించారు. సడెన్‌గా మహేశ్ లుక్ మార్చే శారు. గడ్డం, లాంగ్ హెయిర్ ఏమీ లేదు. అది చూసి నెటి జన్లు షాక్ అవుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవా ణి తనయుడు శ్రీసింహ ఎంగేజ్‌మెంట్‌కి మహేశ్ హాజరయ్యారు.

ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎంగేజ్‌మెంట్ కన్నా కూడా మహేశ్ లుక్ మారడమే ఎక్కువ చర్చనీయాంశంగా మారిం ది. అసలు రాజమౌళి సినిమాలో మహేశ్ లుక్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తి కరంగా మారింది. సాధారణంగా రాజమౌళి తన హీరో లుక్‌ని ముందుగా రివీల్ కానివ్వరు.

కానీ ఈసారి ఎలా రివీల్ చేశారా? అనే సందేహం కొంతమందికి ఉంది. అ నుకున్నట్టే జరిగింది. మొత్తానికి ఇప్పుడు ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనేది ఎంత ఆసక్తికరంగా మారిందో.. మహేశ్ లుక్ ఎలా ఉండబోతోందనేది అంతే ఆసక్తికరంగా మారింది.