24 March, 2026 | 7:48 PM

Breaking News

ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •   కల్లూరు నుండి హైదరాబాద్‌కు బస్సు సర్వీస్   •   కలెక్టరేట్ ముందు టీచర్ల భారీ నిరసన ప్రదర్శన   •  

రెహమాన్‌కు గుడ్ బై చెప్పేసిన భార్య

20-11-2024 12:12 AM

విడాకులు తీసుకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువుగానే ఉంటోంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. తాజాగా ఈ జాబితాలో స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా చేరారు. రెహమాన్ భార్య సైరా బాను తన భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటించారు.

మంగళవారం రాత్రి ఆమె.. ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోతున్నట్టు ధృవీకరిస్తూ చేసిన ఓ ప్రకటన విడుదల చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వివాహ బంధంతో ఒక్కటై 29 ఏళ్లపాటు కలిసి ఉన్న ఈ జంట ఈ నిర్ణయం తీసుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘ఎంతో బాధతో ఈ నిర్ణయం తీసుకున్నాను.

ఈ కష్ట సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు’ అంటూ సైరా బాను ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సైరా బాను కుటుంబం గుజరాత్ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడింది. రెహమాన్, సైరా బాను దంపతులకు ఖతీజా, రహీమా, అమన్ అనే ముగ్గురు సంతానం ఉన్నారు. కుమారుడు అమన్ రెహమాన్ పుట్టిన రోజైన జనవరి 6నే పుట్టాడు.