పశ్చిమ అభివృద్ధే ప్రధాన లక్ష్యం
ఎన్నో ఏళ్ల సుదీర్ఘ సమస్యలకు పరిష్కార మార్గాలు
అభివృద్ధికి ప్రజలు సహకరించాలి
రూ.9.37 కోట్ల పనులకు శంకుస్థాపనలు
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్, మార్చి 2 (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం 48, 49 డివిజన్ల పరిధిలో సుమారు రూ.9.37 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ కుసుర్ పాషా, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. రూ.7.50 కోట్ల వ్యయంతో ఎన్‌ఐటి నుంచి లోటస్ కాలనీ వరకు ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఈ రహదారి రెండు వైపులా సెంటర్ లైటింగ్ వ్యవస్థతో నిర్మా ణం చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 48వ డివిజన్లో రూ.50 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణం, రూ.1.37 కోట్లతో లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రథమ లక్ష్యమని స్పష్టం చేశారు.
శంకుస్థాపనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనులు వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఎన్‌ఐటి రహదారి పనులు ప్రారంభం కావడంతో ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు. అన్ని డివిజన్లలో అంతర్గత రోడ్లు, సీసీ డ్రైనేజీ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కార్పొరేటర్లు మానస రాంప్రసాద్, సత్రాజ్ బేగం, మాజీ కార్పొరేటర్లు అబూబకర్, ఏనుకొంటి నాగరాజు, సీనియర్ నాయకులు అమర్, కట్ట రఘుపాల్ రెడ్డి, మట్టెడ కుమార్, డివిజన్ అధ్యక్షులు సింగరపు రవి ప్రసాద్, మల్లారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.




