16 April, 2026 | 9:07 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

విసుగు చెంది.. స్పందించి.. సమస్య పరిష్కరించి..

02-06-2025 11:34 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి గుంతల మయంగా మారగా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు ప్రతిరోజు మీడియాలో కథనాలు వస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై విసుగు చెందిన ఓ సాధారణ వ్యక్తి ఆటో డ్రైవర్ స్పందించడంపై జిల్లా కేంద్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే ఆటో డ్రైవర్ ఆనందరావు జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఆటో నడుపుతాడు.

ప్రధాన రహదారిపై గుంతలు పూడ్చడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో విసుగుచేంది తన ఆటోలో సంచులతో రాళ్లు మట్టి తీసుకువచ్చి గుంతలు పూడ్చుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారులు ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోకపోవడంతో జిల్లా కేంద్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మొత్తం గుంతలను తాను పూడ్చలేకపోవచ్చని అయితే తనతో అయినంత వరకు గుంతలు పూడ్చనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు కనులు తెరిచి ప్రధాన రహదారి మరమ్మతుల కోసం చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.