16 April, 2026 | 9:07 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కిన కేసీఆర్‌.. అదే బాటలో కాంగ్రెస్

02-06-2025 11:31 PM

ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిద్ది సుధాకర్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత పదేళ్లు ఫామ్ హౌస్‌లో పడుకొని కేసీఆర్‌(KCR) తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కాడని, నేడు అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్ర ఖజానా ఖాళీ పేరుతో అదే బాటలో నడుస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిద్ది సుధాకర్(Aam Aadmi Party Telangana State Convener Dr. Diddi Sudhakar) మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నీళ్లు, నిధులు, నియామకాలను గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయకున్నా10 ఏళ్ళు గారడీ మాటలు చెప్పి  తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే చేస్తే ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

సోమవారం హైదరాబాద్ లిబర్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 11వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా డాక్టర్ దిద్ది సుధా కర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడుతూ.. తెలంగాణ ఏ ఒక్కరి వల్లో రాలేదని, ఎందరో ప్రాణ త్యాగాలతో వచ్చిందని, రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు ఫూర్తి కావస్తున్నా ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోవడం దారుణమన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు సామజిక న్యాయం సక్రమంగా అమలుచేస్తూ కాంగ్రెస్ ప్రభు త్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాత్మకంగా ప్రజలకు దగ్గరై పనిచేయాలని సూచిస్తూ, లేకుంటే సామజిక తెలంగాణ సాధనకు మరో పోరాటం చేస్తామని డాక్టర్ దిద్ది సుధాకర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆప్ నేతలు విజయ్ మల్లంగి, అజీమ్ బైగ్, డా. లక్ష్య నాయుడు, షాబాజ్,ౠసుధరాణి, రాకేష్ రెడ్డి, లియాఖత్ ఖాన్, రాకేష్ సింగ్, భాస్కర్, ఆహాసాన్. ఎస్ ఎన్  రెడ్డి, రమ్య గౌడ్, రాకేష్, పవర్ తదితరులు పాల్గొన్నారు.