సీసీసీ నిర్వహణ ఇక ఆర్‌అండ్‌బీదే!
- ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సేవల కోసం టెండర్ల ఆహ్వానం
- భవన నిర్వహణ కీలకం: టీజీఐసీసీసీ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి
హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మకమైన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) భవన నిర్వహణలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న ఈ అత్యాధునిక భవన నిర్వహణ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ సేవల పర్యవేక్షణ బాధ్యతను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు అప్పగించింది.
ఈ మేరకు రాబోయే మూడు ఏళ్ల కాలపరిమితికి భవన నిర్వహణ కోసం అర్హత గల సంస్థల నుంచి ఆర్‌అండ్‌బీ శాఖ టెండర్లను ఆహ్వానించిం ది. రాష్ట్ర పోలీసు వ్యవస్థకు ఈ ఐకానిక్ భవనం రోజువారీ నిర్వహణ, సాంకేతిక విభాగాల పర్యవేక్షణ ఇతర ఫెసిలిటీ మే నేజ్మెంట్ సేవలను అందించేందుకు అ నుభవజ్ఞులైన సంస్థల నుంచి బిడ్లను కోరారు.
అనుభవం ఉన్న సంస్థలకే ఈ టెండర్లు దక్కేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కేవలం ఒక భవమే కాదని, ఇది నగర పోలీసు వ్యవ స్థ విపత్తు నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తుందని టీజీఐసీసీసీ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. భవనం పనితీరు ఎటువంటి ఆటంకాలు లేకుం డా సజావుగా సాగాలంటే, వత్తిపరమైన భవన నిర్వహణ ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.






