16 April, 2026 | 6:24 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

అధికారుల అలసత్వం.. ఒంటికి, రెంటికి తాళం

20-02-2026 12:52 AM

కోదాడ, ఫిబ్రవరి 18: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లు పనిచేయకపోవడంతో మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆర్డిఓ కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయ ప్రాంగణాల్లో స్వచ్ఛ సంరక్షణలో భాగంగా మరుగుదొడ్లు నిర్మించారు. ఈ మరుగుదొడ్లు ఎప్పుడూ తాళం వేసి ఉండటంతో కార్యాలయాలకు వివిధ పనుల కోసం వచ్చే మహిళలు, వృద్ధులు సైతం ఒంటికి, రెంటికి తాళం వేయాల్సివస్తుంది. ప్రత్యేకించి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారైతే గంటల కొద్దీ కార్యాలయాల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది.

ఈ సమయంలో అత్యవసరాల కోసం మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర అసౌకర్యం కలుగుతోందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం నిధులు ఖర్చు చేసి నిర్మించిన సదుపాయాలు ఉపయోగంలో లేకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం స్వచ్ఛత లక్ష్యాలకు విరుద్ధమని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మరుగుదొడ్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.