2 August, 2026 | 1:28 AM

మణుగూరు డీప్‌సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలి

02-08-2026 12:43 AM

సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్

ముషీరాబాద్, ఆగస్టు 1(విజయక్రాంతి): మణుగూరులోని పికెఓసీ-2 డీప్‌సైడ్ బొగ్గు బ్లాక్ను టీజీ జెన్కోకు కాకుండా సింగరేణి కా లరీస్ కంపెనీకే కేటాయించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరా రు. శనివారం హైదరాబాద్లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం, నాయకుడు వేణుమాధవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లా డుతూ బొగ్గు తవ్వకాలలో అనుభవం, యంత్రాంగం లేని జెన్కో వేలంలో పాల్గొన డం సింగరేణికి అన్యాయమని అన్నారు.

ఈ నెల 3న జరగనున్న బొగ్గు బ్లాక్ వేలంలో జె న్కో పోటీ నుంచి తప్పుకుని, డీ్పు్సడ్ బ్లాక్ను నేరుగా సింగరేణికే కేటాయించేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జోక్యం చేసుకోవాలని విజ్ఞ ప్తి చేశారు. మణుగూరు డీ్పు్సడ్ బ్లాక్ సింగరేణికి దక్కకపోతే 2032 తర్వాత మణుగూ రు ప్రాంతంలో సింగరేణి కార్యకలాపాలు దెబ్బతిని వేలాది మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. సింగరేణిని బలహీనపరిచే నిర్ణయాలు రాజకీయంగా కూడా ప్రతికూల ప్రభావం చూపు తాయని నాయకులు పేర్కొన్నారు.