27 June, 2026 | 5:37 PM

మేయర్, చైర్మన్ పీఠాలే లక్ష్యం!

01-02-2026 01:22 AM
  1. పార్టీ గెలిచే చోట్ల కార్యకర్తలకే టికెట్లు 
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): మున్సిపల్, కార్పొరేషన్లలో మేయ ర్, చైర్మన్ పీఠాలే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. గెలిచే చోట్ల కార్యకర్తలకే టికెట్లు ఇస్తామని, గెలిచే అవకాశం లేని స్థానాల్లో మాత్రమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆ స్థానాల్లో టిక్కెట్లు దక్కని కార్యక ర్తలు  పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ ఉల్లంఘించినట్లేనని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఇన్‌చా ర్జీల సమావేశం శనివారం నిర్వహించారు.

ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ సంస్థాగత ప్రధానకార్యదర్శి చం ద్రశేఖర్ తివారి పాల్గొన్నారు. పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జీలకు రాంచందర్‌రావు దిశానిర్దేశం చేశారు. బీజేపీలో ఉంటూ ఇతర పార్టీల తరపున నామినేషన్ వేసిన వారికి టికెట్లు ఇచ్చే ప్రసక్తేలేదన్నారు. అట్లాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. మళ్లీ వారిని బీజేపీలోకి తీసుకోబోమన్నారు.