17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

01-02-2026 12:43 AM

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి) : మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థు ల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పార్టీనేతలు, శ్రేణులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి.. కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. గాంధీభవన్‌లో శనివా రం జరిగిన జహీరాబాద్ పార్లమెంట్  ని యోజక వర్గం సమావేశంలో ఆయన పాల్గొ ని మాట్లాడారు. 

స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఉంటేనే ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరడానికి అస్కారం ఉంటుందన్నారు.  సమావేశంలో మంత్రులు దామోదర రాజనరసింహ, అజారుద్దీన్, ఎంపీ సురే ష్ షెట్కార్, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, మదన్‌మోహన్‌రావు, తోట లక్ష్మికాంతరావు, మాజీ మంత్రి చంద్రశేఖర్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మ ల జగ్గారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.