మూడు రోజులు వర్షాలు
09-05-2026 12:00 AM
తేలికపాటి నుంచి మోస్తరు వానలు
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో శనివారం నుంచి మూడు రోజు ల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుము లు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో కురువనున్నాయి. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురుస్తాయని తెలిపింది.
ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి. సోమవారం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగ ర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నాయి.






