8 March, 2026 | 3:43 PM

Breaking News

ఆన్‌లైన్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రులు   •   ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •  

చదువుకో తెలంగాణ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

03-02-2026 12:00 AM

చొప్పదండి, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్  చేపట్టిన ‘మిషన్ 10వ తరగతి’ పోస్టర్ ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ చేపట్టిన మిషన్ 10వ తరగతి కార్యక్రమం అభినందనీయమని తెలిపారు.

చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు గొప్ప ప్రోత్సాహమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ గంగాధర బ్రాంచ్ మేనేజర్ వేములవాడ అజయ్, సిబ్బంది పోరండ్ల భూపతి, డీవో మంత్రి మ హేందర్, గోపాలరావు పేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, సువీన్ యాదవ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.