calender_icon.png 9 December, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన ఎమ్మెల్యే స్వస్థలం

08-12-2025 12:06:23 AM

అంగరంగ వైభవంగా , కన్నుల పండుగగా పడి పూజ 

నిజామాబాద్ డిసెంబర్ 7: (విజయ క్రాంతి): ఎమ్మెల్యే స్వస్థలం ఆయన ఇంటి వద్ద‘ అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. అయ్యప్ప నామస్మరణతో ఆ ప్రాంతమంతా  మార్మోగింది. శ్రీ అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులతో ‘పడిపూజ మహోత్సవాన్ని’ బ్రహ్మశ్రీ బల్యపల్లి సుబ్బారావు గురుస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా నిర్వహించారు.

పడిపూజ కోసం  నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ  స్వస్థలం డి.ఎస్.ఎన్ హోమ్స్ లో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి పూలతో వైభవంగా అలంకరించారు. ‘డీఎస్‌ఎన్‌హోమ్స్’ పరిసర ప్రాంతాలను  వివిధ పూలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. 

వాస్తు పూజ, గణపతి, సుబ్రహ్మణ్య  తదితర దేవత షోడశోపచార పూజ, అయ్యప్ప స్వామి ప్రాణప్రతిష్ట, పడి పూజ, అయ్యప్ప స్వామికి అభిషేకం, మంత్రపుష్పం తదితర క్రతువులతో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆయన శ్రీమతి  ధన్‌పాల్, మణిమాలా దంపతులుతో పాటు సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు ఆచరించారు. 

పడిపూజ మహోత్సవ వేడుకలను తిలకించడానికి అశేష సంఖ్యలో భక్తులుతరలివచ్చారు. పడిపూజ సందర్భంగా  అయ్య ప్ప స్వాములకు,  భక్తుల కోసం ఎమ్మెల్యే బిక్షప్రసదo  ఏర్పాటు చేశారు. గురుస్వామి మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నిజామాబాద్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. హిందూ ధర్మా పరిరక్షణ  కోసం పాటు పడే నాయకులు దొరకడం మన అదృష్టం.

భక్తుల కోసం ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యేకు హృదయపూర్వక ధన్యవాదముల తెలిపారు. అయ్యప్ప స్వామి పడి పూజ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ప్రియ భక్తబంధువులారా ఈరోజు పవిత్రమైన అయ్యప్ప స్వామి పడి పూజ సందర్బంగా మీ అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. మన భారతీయ సంస్కృ  తిలో కుటుంబ వ్యవస్థకు ఉన్న విలువ అపారం. సంస్కారం, సేవ, పరస్పర గౌరవం, ప్రేమ ఇవన్నీ మన కుటుంబాన్ని నిలబెట్టే వేర్లు. ఈ విలువలన్నింటినీ కాపాడుతూ మన సనాతన ధర్మం వేల ఏళ్లుగా నడిచిపోతోంది.

ప్రపంచం మారినా, యుగాలు మారినా, మన కుటుంబ వ్యవస్థ మాత్రం ధర్మాధారంగా వెలుగుతూ వస్తోందఅన్నారు. అయ్యప్ప స్వామి భక్తి కూడా అంతే పవిత్రం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు 41 రోజుల దీక్షలోకి ఆచరిస్తారన్నారు. ఈ మాలధారణ అంటే కేవలం ఆచారం కాదు ఇది మనస్సును శుద్ధి చేసే సాధన, శరీరాన్ని నియంత్రించే నియమం, ఆత్మను ఉన్నత స్థితికి చేర్చే మార్గం.

ఈ 41 రోజులు భక్తులు పాటించే అహింస, సత్యం, సాధన ఇవన్నీ మన సనాతన ధర్మం నేర్పిన విలువలే. ఒకరి మీద ఒకరు గౌరవం, సమానత్వం, అన్నదమ్ముల బంధం ఇవే అయ్యప్ప స్వామి భక్తి  అని ఎమ్మెల్యే తెలిపారు  తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో, సమాజంలో ఐక్యత, కుటుంబాల్లో ఆనందం, ప్రతి ఇంట్లో ఆరోగ్యం, సంపద, శాంతి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ముధోల్ ఎమ్మెల్యే రామారావ్ పాటిల్ జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా  అధ్యక్షులు దినేష్ కులచారి మల్లారం ఆశ్రమం పిఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ పిట్ల కృష్ణ మహారాజ్  గుండయ్య స్వామి, గజవాడ ఆగమయ్య స్వామి,  యoసాని రవీందర్ స్వామి, పార్షి రవీందర్ స్వామి, చెన్న గంగరత్నం,

అసద్ గంగాధర్, ప్రకాష్ రెడ్డి స్వామి, లాబిశెట్టి శ్రీనివాస స్వామి, మంచాల జ్ఞానేంద్ర స్వామి, ధన్ పాల్. వంశీకృష్ణ స్వామి, ధన్ పాల్. ఉదయ్   ధన్ పాల్. ప్రణయ్, ధన్ పాల్. వినయ్ , బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ బీజేపీ నాయకులు, ప్రముఖులు, జిల్లా అధికారులు, భక్తులు  తదితరులు  పాల్గొన్నారు.