08-12-2025 12:08:55 AM
ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
దేవరకద్ర, డిసెంబర్ 7: అభివృద్ధికి పట్టం కట్టాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం చిన్నచింతకుంట మండలం బండ్రవల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి టీ. లక్ష్మీ తిరుపతికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి, బ్యాట్ గుర్తుకు ఓటు వేసి టీ. లక్ష్మీ తిరుపతి గారిని గెలిపించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. పారదర్శకంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరు మొదటి ప్రాధాన్యత తెలపాలని సూచించారు.