calender_icon.png 1 October, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ఎన్నికలు పూర్తయ్యే వరకు మాడల్ కోడ్ ఉంటుంది

01-10-2025 01:28:58 AM

పెద్దపల్లి, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి)జిల్లాలో మాడల్ కోడ్ పంచాయితీ ఎన్నిక లు పూర్తి అయ్యే వరకు ఉంటుందని జిల్లా క లెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవా రం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులతో కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వర కు మాడల్ కోడ్ అమలులో ఉంటుందని, ఫేజ్-2 , ఫేజ్-3 లో మాత్రమే ఎన్నికలు జరుగుతాయని, ఫేజ్ -1 లో ఎన్నికలు జరగవని, అభ్యర్థులు ఏమైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటే సంబంధిత ఆర్డీవోల దగ్గర అనుమతి పొందాలని, ఏమైనా సమస్యలు ఉంటే మం డల స్థాయిలో ఎం.పీ.డీ.వో.లను, జిల్లాస్థాయిలో జడ్పీ.సీ.ఈ.ఓ, డి.పి.ఓ.లను సంప్రదించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జె .డ్పి సీ.ఈ.ఓ. నరేందర్, డి.పి.ఓ. వీర బుచ్చ య్య, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.